చర్యలు తీసుకోవాలి
మణుగూరు రూరల్: సమితిసింగారం గ్రామపంచాయతీ రాజీవ్‌గాంధీనగర్‌లో బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి గుండి గౌరి ప్రచారం వాహనంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ జిల్లా ఽఅధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డిమాండ్ చేశారు. ఆదివారం దాడిని ఖండిస్తూ అంబేద్కర్ సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో బీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణను ఓర్వలేకనే ప్రచార వాహనంపై, డ్రైవర్‌పై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పోశం నర్సింహరావు, కుర్రి నాగేశ్వరరావు, కె.లక్ష్మణ్, ముత్యం బాబు, అడపా అప్పారావు, వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీనివాస్, యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, వేర్పుల సురేష్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు


