ఖమ్మంలో ఉమ్మడి జిల్లా డ్రైవర్ల సంఘం సమావేశం
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నగరంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జహీంగీర్‌అలీ, హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ ఎండీ సలీం, జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు హాజరై ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా డ్రైవర్‌లకు ప్రతి సంవత్సరం లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తామన్నారు. ఖమ్మం జిల్లా సంఘానికి వాహనం కొనుగోలు చేసినందుకు సభ్యులు ఆమోదించారని చెప్పారు. ఇళ్ల స్థలాలు త్వరలోనే వస్తాయని హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి వేణుగోపాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోకన్వీనర్ రాఘవులు, నాగరాజు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పలువురిపై కేసు నమోదు
మణుగూరు టౌన్: మండలంలోని సమితిసింగారం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ వాహనంపై దాడి చేసిన ఘటనలో పలువురిపై కేసు నమోదైనట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహేశ్, నరేశ్‌లతో పాటు ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, పలువురు నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


