మొన్నటి వరకు జెడ్పీటీసీ.. నేడు వార్డు బరిలో
చండ్రుగొండ: మండలకేంద్రం చండ్రుగొండకు చెందిన తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, బీఆర్‌ఎస్ నాయకుడు కొడకండ్ల వెంకటరెడ్డి నేడు పంచాయతీ ఎన్నికల్లో 3వ వార్డు సభ్యుడి బరిలో నిలిచారు. 2019 మొదలైన ఆయన రాజకీయ ప్రస్తానం 2024 వరకు జెడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం వార్డు సభ్యుడిగా పోటీ చేయడం చర్చనీయంగా మారింది.
గతంలో ఎంపీపీ.. నేడు సర్పంచ్ బరిలో
ఉమ్మడి చండ్రుగొండ మండలం ఎంపీపీగా పనిచేసిన పోకలగూడెం గ్రామానికి చెందిన గుగులోతు బాబు నేడు పోకలగూడెం పంచాయతీ సర్పంచ్ బరిలో నిలిచారు. 2006 నుంచి 2011 వరకు ఎంపీపీగా ఆయన పనిచేయగా.. అంతకుముందు 2004 నుంచి 2006 వరకు బాబు సతీమణి గుగులోతు మీన ఎంపీపీగా పనిచేశారు.
మొన్నటి వరకు జెడ్పీటీసీ.. నేడు వార్డు బరిలో


