సాయి ఈశ్వరాచారికి నివాళి
ఖమ్మంమామిళ్లగూడెం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కలేదనే ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడిన సాయి ఈశ్వరాచారికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు నివాళులర్పించా రు. ఖమ్మం శ్రీశ్రీ సర్కిల్ వద్ద శనివారం కొ వ్వొత్తులు వెలిగించి నివాళులర్పించగా జాతీ య బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి మోడేపల్లి కృష్ణమాచారి మాట్లాడారు. రాజకీయ పార్టీల కుట్రలో సాయి ఈశ్వరాచారి అమరుడయ్యాడని తెలిపారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగన్నబోయిన పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ, నాయకులు గద్దె వెంకటరామయ్య, మల్లికార్జున్, గజ్జల శ్రీదేవి, ఇనగాల ఉపేంద్రాచారి, కృష్ణవేణి, సిద్ధు, సచ్చితానంద్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు ఉన్న వారికి మినహాయింపు ఇవ్వాలి
ఖమ్మంసహకారనగర్: ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న వారే కాక దివ్యాంగులు, గర్భిణు లు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటు న్న ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్‌టీఎఫ్) నాయకులు కోరారు. ఎన్నికలవిధుల కేటాయింపులో సీనియర్ ఉపా ధ్యాయులకు కాకుండా జూనియర్లకు స్టేజీ–2 బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిపారు. ఇక నైనా సీనియర్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని, వారు పనిచేస్తున్న మండలం నుంచి సమీప ప్రాంతాల్లోనే విధులు కేటాయించాలని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షు డు ధరావత్ రాములు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్టా శ్రీనివాసరావు, సింగారపు వేణు ఒక ప్రకటనలో కోరారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
మణుగూరు టౌన్: కట్టుమల్లారం గ్రామంలోని రోడ్డుపై శనివారం రాత్రి రెండు మోటార్‌సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. విఘ్నేష్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో భద్రాచలం తీసుకెళ్లారు.
చేపల వేటకు వెళ్లి
మత్స్యకారుడు మృతి
కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మండలంలోని ఎర్రగడ్డ తండాకు చెందిన బానోత్ వాల్యా (62) శనివారం రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లాడు. అక్కడ వల విసిరే క్రమంలో వల కాళ్లు, చేతులకు చుట్టుకోవడంతో ఆయన నీటిలో పడి ఊపిరి ఆడక మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎర్రబోయినపల్లిలో
ఎస్‌ఓటీ పోలీసుల తనిఖీలు
సత్తుపల్లి: హైదరాబాద్ కేంద్రంగా జరిగిన సైబర్ క్రైంలో నిందితులుగా ఉన్న కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికిచెందిన పోట్రు ప్రవీణ్, పోట్రుప్రకాష్ ఇళ్లలో శనివారం ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీ చేపట్టారు. పోట్రు ప్రకాష్ తల్లి ఇటీవల కన్నుమూయగా ఆమె దశదినకర్మ కోసం ఎర్రబోయినపల్లికి చెందిన ముగ్గురు జామీన్ సమర్పించి ఆయనను తీసుకొచ్చారు. అయితే, ఆయన శుక్రవారం హైదరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులకు లొంగిపోవాల్సి ఉన్నా వెళ్లకపోవడంతో శనివారం పోలీసులు చేరుకున్నారు. ఈ మేరకు జామీన్ సమర్పించిన వారితో పాటు ప్రవీణ్, ప్రకాశ్ తండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై అటు స్థానిక పోలీసులు, ఇటు ఎస్‌ఓటీ పోలీసులు స్పందించడానికి నిరాకరించారు. కాగా, అరెస్టుల సంఖ్య ఇప్పటికే 11కు చేరడంతో ఇంకెవరెవరి పేర్లు బయటకు వస్తాయోనన్న చర్చ జరుగుతోంది.


