ఒకే ఇంటి నుంచి నలుగురు పోటీ
పాల్వంచరూరల్: మండల పరిధిలోని ప్రభాత్‌నగర్ (రెడ్డిగూడెం) గ్రామ పంచాయతీలో ఒకే కుటుంబం నుంచి నలుగురు ఎన్నికల బరిలో నిలిచారు. సీపీఐ మద్దతుతో పొదెం రాజేష్ సర్పంచ్‌గా, ఆయన భార్య నాగమణి 5వ వార్డు సభ్యురాలిగా, తండ్రి వెంకన్న 7 వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. రాజేష్‌కు ప్రత్యర్థిగా అతని సోదరి పొదెం నిషారాణి పోటీ చేస్తోంది. ఈమెకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మద్దతు తెలుపుతోంది.
వార్డు బరిలో మాజీ సర్పంచ్
గత పాలకవర్గంలో రెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేసిన ఇర్ప మంగమ్మ ఈ ఎన్నికల్లో 3వ వార్డు సభ్యురాలిగా నామినేషన్ వేశారు.


