హోంగార్డుల సేవలు అమోఘం
కొత్తగూడెంటౌన్: హోంగార్డ్ ఆఫీసర్ల సేవలు అమోఘమని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రం హేమచంద్రాపురంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన హోంగార్‌ుడ్స ఆవిర్భావ వేడుకల(రైజింగ్ డే)కు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. శాంతికపోతాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరదలు, ఎన్నికల సమయంలో హోంగార్డులు అంకిత భావ ంతో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసుశాఖ ప్రతిష్టను మరింత పెంచేలా పని చేయాలని సూచించారు. అనంతరం త్వరలో పదవీ విరమణ పొందనున్న ఇద్దరు హోంగార్డులను సన్మానించారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, కరుణాకర్, ప్రతాప్, ఆర్‌ఐ నర్సింహారావు, హోంగార్డ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు


