పతాక నిధికి కలెక్టర్ తొలి విరాళం
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సాయుధ దళాల దినోత్సవ పతాక నిధి కార్యక్రమాన్ని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రారంభించి తొలి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీరమరణం పొందిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం వినియోగించే పతాక నిధికి విద్యాసంస్థలు, పారిశ్రామిక వర్గాలు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు విరాళాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి ఎం చంద్రశేఖర్, వింగ్ కమాండర్ రిటైర్డ్ సురేందర్, ఆర్మీ రిటైర్డ్ సుభాని, కృష్ణమూర్తి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


