కోయగూడెం బీఆర్‌ఎస్ అభ్యర్థిపై దాడి
టేకులపల్లి: మండలంలోని కోయగూడెం సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ మద్దతుతో బరిలోకి దిగుతున్న తనపై ఇల్లెందు ఎమ్మెల్యే సోదరుడు కోరం సురేందర్ దంపతులు దాడి చేశారని పూనెం కరుణాకర్ ఆరోపించారు. శుక్రవారం చుక్కాలబోడు నామినేషన్ల కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి మాట్లాడారు. వార్డు అభ్యర్థులతో కలిసి శుక్రవారం రెండో సెట్ దాఖలుకు రాగా, ఎమ్మెల్యే కోరం కనకయ్య సోదరుడు సురేందర్ – ఉమ దంపతులు పత్రాలు లాక్కున్నారని తెలి పారు. నామినేషన్ వేయకుండా అడ్డుకుని, అయ్యప్ప మాల ధరించిన తనను దుర్భాషలాడుతూ సురేందర్ దంపతులు దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఆర్‌ఓ, ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. కాగా, ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఆరోపించారు. నాయకులు హరిసింగ్, బొమ్మెర్ల వరప్రసాద్, రామ, బాలకృష్ణ, పాపయ్య పాల్గొన్నారు. ఈ ఘటనలో సురేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.
● టేకులపల్లి నామినేషన్ కేంద్రంలో ప్రచారం చేయొద్దని సూచించిన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి బానోతు పూర్ణను కులం పేరుతో దూషించినట్లు అందిన ఫిర్యాదుతో పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
ఎమ్మెల్యే సోదరుడిపై ఫిర్యాదు, కేసు


