గురితప్పని విద్య | - | Sakshi
Sakshi News home page

గురితప్పని విద్య

Nov 15 2025 7:27 AM | Updated on Nov 15 2025 7:27 AM

గురిత

గురితప్పని విద్య

కిన్నెరసాని మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో శుక్రవారం జిల్లాస్థాయి విలువిద్య పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జూనియర్స్‌, సీనియర్స్‌ బాలబాలికల విభాగాల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారు. ఐటీడీఏ డీడీ అశోక్‌, ఆర్చరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యుడు పుట్టా శంకరయ్య క్రీడలను ప్రారంభించారు. గిరిజన విద్యార్థులు విలువిద్యలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.యుగంధర్‌రెడ్డి, ఐటీడీఏ అధికారులు గోపాల్‌రావు, చంద్రమోహన్‌, వెంకటనారాయణ, బి.శంకర్‌, నాగేశ్వరరావు, రాంబాబు, పీడీ బాలసుబ్రహ్మణ్యం, అంజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

–పాల్వంచరూరల్‌

గురితప్పని విద్య1
1/1

గురితప్పని విద్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement