క్వారీ కేటాయించకుండా ఇబ్బందులు..
చుంచుపల్లి: ఇసుక క్వారీని తమకు కాకుండా ఇతరులకు కేటాయించాలని చూస్తున్నారని, ఆ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ మణుగూరు మండలం కె.కొండాపురం గ్రామానికి చెందిన శ్రీ సీతారామ సొసైటీ సభ్యులు శుక్రవారం సహకార శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల ప్రలోభాలకు ఆశపడి అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని, సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి ఆరు నెలలు అవుతున్నా ఇసుక క్వారీని కేటాయించకుండా జాప్యం చేస్తున్నారని, రెండు వారాల కిందట రిజిస్ట్రేషన్ చేసుకున్న సొసైటీకి కేటాయించారని ఆరోపించారు. తమ తనిఖీల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు లావణ్య, వెంకటనర్సమ్మ, జయలక్ష్మి, భారతి, నాగలక్ష్మి, యర్రమ్మ, నర్సమ్మ, వెంకటరమణ, భద్రమ్మ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
డీసీఓ కార్యాలయంలో
శ్రీసీతారామ సొసైటీ సభ్యుల వినతి


