ఆర్థ్ధిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సత్తుపల్లి మసీద్‌రోడ్డుకు చెందిన షేక్ గౌసుద్దీన్(34) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఆయన సత్తుపల్లి మండలం సత్యంపేటలో నివాసం ఉంటున్నాడు. కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుండడంతో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గౌసుద్దీన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు.


