మామిళ్లవాయి గ్రామాన్ని సందర్శించిన డీఎఫ్‌ఓ | - | Sakshi
Sakshi News home page

మామిళ్లవాయి గ్రామాన్ని సందర్శించిన డీఎఫ్‌ఓ

Nov 8 2025 7:44 AM | Updated on Nov 8 2025 7:44 AM

మామిళ

మామిళ్లవాయి గ్రామాన్ని సందర్శించిన డీఎఫ్‌ఓ

అశ్వాపురం: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన మామిళ్లవాయిని శుక్రవారం డీఎఫ్‌ఓ కృష్ణగౌడ్‌ సందర్శించారు. గ్రామంలో అటవీ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. గ్రామంలోని వాటర్‌ పాల్స్‌, చెక్‌డ్యామ్‌ను సందర్శించారు. ఫారెస్ట్‌, వైల్డ్‌లైఫ్‌ అధికారులు, సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైల్డ్‌ లైఫ్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దుకాణం కోసం పోటీ.. పెరిగిన ఆదాయం

పాల్వంచరూరల్‌: మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద కొబ్బరికాయల దుకాణాలతోపాటు ఇతర లీజు, లైసెన్స్‌ హక్కులు కేటాయించేందుకు శుక్రవారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఉమా సోమలింగేశ్వరస్వామి ఆలయ ఈఓ వీ.ఎల్‌.వీ.వెంకట్రావు పర్యవేక్షణలో వేలం కొసాగింది. ఈ సందర్భంగా 9వ నంబర్‌ షాపు (కొబ్బరికాయల దుకాణం) కోస ం పాటదారుల మధ్య పోటీ పెరగడంతో జగన్నాథపురం గ్రామానికి చెందిన కొదుమూరు వినయ్‌కుమార్‌ మూడేళ్లకు నెలనెలా రూ.16, 100 అద్దెతో దక్కించుకున్నాడు. గతంలో ఇదే షాపును ప్రతీనెలా రూ.10,200కే కేటాయించగా, ఇప్పుడు రూ.5,900 ఆదాయం పెరిగింది. మిగతా షాపులు, పూలదండల విక్రయాల తదితర హక్కులకు సరైన పాట రాకపోవడంతో ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.

జాతీయస్థాయి

పోటీలకు ఎంపిక

పాల్వంచ: సికింద్రాబాద్‌ బోయినపల్లిలోని సెయింట్‌ పీటర్‌ హైస్కూల్‌లో ఇటీవల నిర్వహించిన సీబీఎస్‌ఈ సైన్స్‌ ఎగ్జిబిషన్‌–2026లో పాల్వంచ నవభారత్‌ పబ్లిక్‌ స్కూల్‌ 8వ తరగతి విద్యార్థులు పి.రోడా గ్రీస్‌, ఎ.కృషి ప్రతిభ కనబర్చారు. డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు ఎంపికయ్యారు. విద్యార్థులను కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ప్రిన్సిపాల్‌ ఏవీకే.ప్రసాద్‌, మెంటార్‌ షేక్‌ ఖాజా తదితరులు అభినందించారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని విద్యార్థి మృతి

ఖమ్మం అర్బన్‌: గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ విద్యార్థి తీవ్రగాయాలతో మృతి చెందాడు. ఖమ్మం అర్బన్‌ సీఐ భానుప్రకాశ్‌ తెలిపిన వివరాలు... కొణిజర్లకు చెందిన పానుగంటి శ్రీకాంత్‌(20) బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం అర్ధరాత్రి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై ఖమ్మం వైపు వస్తుండగా గోపాలపురం కాశ్మీర్‌ దాబా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అంతేకాక ఆయన పైనుంచి వాహనం వెళ్లడంతో పొట్ట భాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. తొలుత మృతదేహం వద్ద ఆధారాలు లభించకపోవడంతో అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆతర్వాత ఆచూకీ తెలియడంతో శ్రీకాంత్‌ తండ్రి శ్రీను ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మామిళ్లవాయి గ్రామాన్ని సందర్శించిన డీఎఫ్‌ఓ 1
1/1

మామిళ్లవాయి గ్రామాన్ని సందర్శించిన డీఎఫ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement