డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
భద్రాచలంఅర్బన్: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాచలంటౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో మాదకద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనగా.. ఏఎస్పీ మాట్లాడారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం అంధకారమవుతుందని, యువత విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని సూచించారు. గుట్కాలు, మత్తు పదార్థాలు విక్రయించే ప్రాంతాల సమాచారం తెలిస్తే పోలీసులకు చెప్పాలని, కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఐటీడీఏ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు.. అక్కడి నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ సతీశ్ విద్యార్థులతో గంజాయికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భద్రాచలంటౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ ఎస్‌ఐ తిరుపతి, టౌన్ ఎస్‌ఐ శ్యాంప్రసాద్, సీఆర్పీఎఫ్ అధికారులు, జవాన్లు పాల్గొన్నారు.
బూర్గంపాడులో..
బూర్గంపాడు: యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ అన్నారు. సారపాకలోని గాంధీనగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అక్రమంగా నిర్వహించే బెల్ట్‌షాపులు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అనుమతి పత్రాలు లేని 42 బైక్‌లు, 5 ఆటో లు, రూ.5 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీశ్, ఎస్‌ఐలు ప్రసాద్, నాగభిక్షం, దేవ్‌సింగ్, సురేశ్, మధుప్రసాద్, కల్యాణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం


