ఘనంగా సత్యనారాయణ వ్రతం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం కార్తీక మాసం సందర్భంగా చిత్రకూట మండపంలో ఆర్జిత సేవలో భాగంగా సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రామాలయంలోని అంతరాలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం, సువర్ణ పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆర్జిత సేవల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిత్యకల్యాణం సంప్రదాయబద్ధంగా జరిపారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, కంకణధారణ, మాంగల్యధారణ, వేద ఆశీర్వచనంతో కల్యాణ ప్రక్రియ ముగించారు.
ఘనంగా సత్యనారాయణ వ్రతం


