
భారీ క్రేన్లతో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి..
12 మీటర్ల వెడల్పుతో
నిర్మాణం
అమృత్ భారత్ పథకంలో భాగంగా భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌లో చేపట్టిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. స్టేషనలోని మొదటి ప్లాట్‌ఫామ్ నుంచి రెండో ప్లాట్‌ఫామ్ వరకు ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. హైదరాబాద్, ఖమ్మం నుంచి భారీ క్రేన్లు తెప్పించి నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. కాగా భారీ క్రేన్లతో జరుగుతున్న పనులను స్థానికులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. – కొత్తగూడెంఅర్బన్