
భద్రాద్రిలో కార్తీక పూజలు
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన అనుబంధంగా ఉన్న ఉమామహేశ్వరి సమేత రామలిగేశ్వర స్వామి ఉపాలయంలో జరిగిన కార్తీక మాస పూజల్లో ఈఓ దామోదర్‌రావు దంపతులు పాల్గొన్నారు. పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం కార్తీక మాస పురాణ విశిష్టత, సంగీత, నృత్య కార్యక్రమాలు జరిపారు. ఇదిలాఉండగా గోదావరి తీరం కార్తీక శోభను సంతరించుకుంది. తొలిరోజు బుధవారం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు బారులుదీరారు. మహిళలు స్నానాలు ఆచరించి, ఒత్తులను వెలిగించి గోదావరిలో వదిలారు. రామాలయంతో పాటు అనుబంధ ఆలయాలను సందర్శించారు.