
కొండరెడ్లకు చేయూతనిస్తాం
దమ్మపేట : కొండరెడ్లకు జీవనోపాధితోపాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఐటీడీఏ భద్రాచలం ద్వారా చేయూతనిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.రాహుల్ అన్నారు. మండలంలోని పూసుకుంట గ్రామంలో కొండరెడ్ల (గిరిజన) కుటుంబాల జీవనోపాధిని పెంపొందించేందుకు చేపట్టాల్సిన మౌలిక వసతులు, కార్యాచరణ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ కొండరెడ్ల జీవనోపాధికి టెంట్ హౌస్‌లు, పవర్ టిల్లర్ యంత్రాలను అందజేసి, 14 మంది రైతులకు వ్యవసాయ క్షేత్రాల్లో నీటి బోర్లు వేయించి, పామాయిల్ మొక్కలను నాటించామని వివరించారు. తేనెటీగలు, పుట్టగొడుగులు, మేకలు, గొర్రెలు, గేదెల పెంపకంను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో 25 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, ఏపీఓ డేవిడ్ రాజ్, ఎంపీడీఓ రవీంద్రారెడ్డి, డీఈ బాపనయ్య, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, సీడీపీఓ హేమసత్య, హరికృష్ణ, సాయికృష్ణ, సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్