మొక్కలు నాటి పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటి పరిరక్షించాలి

Sep 7 2025 7:38 AM | Updated on Sep 7 2025 7:38 AM

మొక్క

మొక్కలు నాటి పరిరక్షించాలి

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌

పొదెం వీరయ్య

చర్ల: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పొదెం వీరయ్య పిలుపునిచ్చారు. బయోడైవర్సిటీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా ఐటీసీ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని కొయ్యూరు శివారు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని అన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇర్పా శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల విజయ భాస్కర్‌రెడ్డి, నాయకులు సోడి చలపతి, ఇందుల బుచ్చిబాబు, బండారు రామకృష్ణ, మేడిచర్ల వీరకుమార్‌, ఆవుల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

బీఆర్‌ఎస్‌ జిల్లా అఽధ్యక్షుడు రేగా కాంతారావు

మణుగూరు రూరల్‌: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ జిల్లాఽ అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ పోశం నర్సింహరావు, నాయకులు లక్ష్మణ్‌, ముత్యంబాబు, అడపా అప్పారావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్‌, ఆవుల నర్సింహరావు, వేర్పుల సురేష్‌, అక్కి నర్సింహరావు, మేకల రవి, జావిద్‌పాషా, బోశెట్టి రవి, గుర్రం సృజన్‌ పాల్గొన్నారు.

సింగరేణిలో 49 మంది అధికారుల బదిలీ

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని ఈఅండ్‌ఎం విభాగంలో పనిచేస్తున్న 49 మంది అధి కారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి కార్పొరేట్‌ ఈఈ సెల్‌ హెచ్‌వోడీ ఏజే మురళీధర్‌ రా వు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు ఏజీఎంలు, ఏడుగురు డిజీఎంలు, 19 మంది ఎస్‌ఈలు, 10 మంది డీవైఎస్‌ఈలు, ఆరుగురు ఈఈలు, ఇద్దరు జేఈలు ఉన్నారు. వీరంతా ఈ నెల 19లోపు కేటాయించిన ప్రదేశాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

డీజే సౌండ్‌కు

కుప్పకూలిన మహిళ

నేలకొండపల్లి: వినాయక నిమజ్జనంలో ఏర్పా టు చేసిన డీజే శబ్దంతో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. మండలంలోని మంగాపురంతండా లో శనివారం రాత్రి గణేశ్‌ శోభాయాత్ర జరుగుతుండగా డీజే పాటలకు అనుగుణంగా భూక్యా పార్వతి నృత్యం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కుప్పకూలగా స్థానికంగా చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. అలాగే, మండల కేంద్రంలో వినాయక శోభాయాత్రలో భాగంగా బాణసంచా కాల్చేక్రమాన ప్రమాదంజరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

విద్యుదాఘాతంతో

మేకల కాపరి మృతి

తిరుమలాయపాలెం: మేకలు మేపేందుకు వెళ్లి చెట్టుకొమ్మలు కొడుతున్న క్రమాన విద్యుదాఘాతానికి గురైన కాపరి మృతి చెందాడు. మండలంలోని ఇస్లావత్‌తండాకు చెందిన ఇస్లావత్‌ సక్లాల్‌ (26) వ్యవసాయంతో పాటు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం మేకలతో అడవికి వెళ్లిన ఆయన చెట్ల కొమ్మలు కొట్టి వేస్తుండగా, ఆపైన ఉన్న విద్యుత్‌ లైన్‌ తాకడంతో షాక్‌కు గురై పక్కనే బావిలో పడ్డాడు. కొద్దిసేపటికి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని బయటకు తీయించారు. సక్లాల్‌కు భార్య సరిత ఉంది. ఆయన తండ్రి నాగులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కుక్కల దాడిలో

లేగదూడ..

నేలకొండపల్లి: చెరువుమాధారంలో కుక్కలుదాడి చేయగా లేగ దూడ మృతి చెందింది.గ్రామానికి చెంది న రైతు తెల్లగొర్ల అనిల్‌ అప్పుడే పుట్టిన లేగదూడను శనివారం పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. ఈక్రమాన కుక్కల గంపు దాడిచేసి దూడనుఈడ్చుకెళ్లి దాడి చేయడంతో చనిపోయింది. మరికొన్ని పశువుల వెంట పడడంతో స్థానికులు స్పందించగా కుక్కలు పారిపోయాయి.

మొక్కలు నాటి  పరిరక్షించాలి1
1/1

మొక్కలు నాటి పరిరక్షించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement