
రూ. 2 లక్షలు పలికిన లడ్డూ
అశ్వారావుపేటరూరల్: వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట రికార్డు స్థాయిలో ధర పలికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అశ్వారావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్దగల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా శనివారం 37 కేజీల స్వామి వారి లడ్డూకు వేలంపాట నిర్వహించారు. అశ్వారావుపేటకు చెందిన సెల్‌ఫోన్ షాపు వ్యాపారి శీమకుర్తి జితేంద్ర అత్యధికంగా రూ.2 లక్షలకు లడ్డూను కై వసం చేసుకున్నాడు. కాగా ఇక్కడి మండపంలో గతేడాది స్వామివారి లడ్డూ వేలం పాటలో రూ.38 వేలు పలికింది.
‘గణేష్’ లడ్డూను కై వసం చేసుకున్న ముస్లిం
ఇల్లెందు: ఓ ముస్లిం యువకుడు వేలంపాటలో గణేష్ లడ్డూను కై వసం చేసుకుని మతసామరస్యం చాటాడు. పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో 6వ లైన్ పరుశురాం యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో శనివారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. దీంతో ముస్లిం యువకుడు ఇమామ్ పాల్గొని రూ. 49,116కు కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడి యూత్ సభ్యులు అభినందించారు. కాగా శనివారం ఇల్లెందులో ఘనంగా వినాయక నిమజ్జనం జరిగింది. సత్యనారాయణపురం కుంటలో నిమజ్జనం చేశారు. వినాయక ప్రతిమల ఊరేగింపుతో పట్టణంలో సందడి నెలకొంది.

రూ. 2 లక్షలు పలికిన లడ్డూ