
మహిళపై కుక్క దాడి
జూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ భీమ్లాతండా డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీకి చెందిన బాదావత్ పద్మ(49) బుధవారం ఉదయం వాకిలి ఊడుస్తుండగా పిచ్చి కుక్క దాడి చేసింది. దీంతో ముఖంపై త్రీవ గాయాలు కాగా, కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆమెను ఏపీ రాష్ట్రం గుంటూరు ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
బాలిక అదృశ్యం
పాల్వంచరూరల్: పదో తరగతి బాలిక అదృశ్యంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన విద్యార్థిని(16) బుధవారం స్కూల్‌కు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. పాఠశాలకు రాలేదని వాచ్‌మెన్ ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ సురేశ్ అదృశ్యం కేసు నమోదు చేశారు.
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కొత్తగూడెంటౌన్: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది ఓ వ్యక్తి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం.. రామవరం పంజాబ్‌గడ్డ బస్తీకి చెందిన మైలారపు ప్రసాద్ కుమారుడు జైకుమార్ (23) మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన అఖిల భార్గవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తూ భార్యతో కలిసి అక్కడే జీవనం సాగిస్తున్నాడు. కాగా ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిన అఖిల తిరిగి భర్తకు వద్దకు రాలేదు. పలుమార్లు కోరినా కాపురానికి రావడంతో జైకుమార్ మనోవేదనకు గురయ్యాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీపీటీఎఫ్ నాయకుడు నాగేశ్వరరావు మృతి
ఖమ్మంసహకారనగర్/ఖమ్మంఅర్బన్: టీపీటీఎఫ్ నాయకుడు రాయప్రోలు నాగేశ్వరరావు (59) బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స చేయిస్తుండగా కన్నుమూశారని సంఘం బాధ్యులు తెలిపారు. ప్రస్తుతం నాగేశ్వరరావు ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడిగా విధు లు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థి దశలోనే పీడీఎస్‌యూలో చేరిన ఆయన ఉపాధ్యాయుడిగా నియామకమయ్యాక ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్‌లో ఖమ్మం అర్బన్ మండలం ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కౌన్సిలర్‌గా వ్యవహరించారు. నాగేశ్వరరావు మృతిపై టీపీటీఎఫ్ నాయకులు వి.మనోహర్‌రాజు, నాగిరెడ్డి సంతాపం తెలిపారు.

మహిళపై కుక్క దాడి