
కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక
మణుగూరు రూరల్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాకు చెందిన కార్మిక సంఘ నాయకుడు ఊకంటి ప్రభాకర్ రావు అనుచరులతో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కేటీఆర్ బీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మణుగూరు మాజీ జెడ్పీటీసీ పోశం నర్సింహరావు, నాయకులు పాల్గొన్నారు.