
విత్తన చాలెంజ్‌లో సత్తా
టేకులపల్లి: కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఇచ్చిన విత్తన చాలెంజ్ కార్యక్రమంలో మండలంలోని పాఠశాలలు సత్తా చాటాయి. 13 కేజీల 985 గ్రాముల విత్తనాలు సేకరించి సులానగర్ కాంప్లెక్స్‌లోని హనుమాతండా ఎంపీపీఎస్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంఈఓ అజ్మీర జగన్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి కాంప్లెక్స్‌లో 4 కేజీల 600 గ్రాములతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సులానగర్ కాంప్లెక్స్‌లో 13 కేజీల 985 గ్రాములతో ఎంపీపీఎస్ హనుమాతండా , బొమ్మనపల్లి కాంప్లెక్స్‌లో కేజీతో ఎంపీపీఎస్ బొమ్మనపల్లి, ముత్యాలంపాడు కాంప్లెక్స్‌లో 4 కేజీల 900 గ్రాములతో ఎంపీయూపీఎస్ తావుర్యాతండా, బోడు కాంప్లెక్స్‌లో 2 కేజీల 900 గ్రాములతో ఎంపీపీఎస్ బర్లగూడెం, కుంటల్ల కాంప్లెక్స్‌లో 4 కేజీలతో ఎంపీపీఎస్ దాసుతండా పాఠశాలలు విజేతలుగా నిలిచాయి. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, విజేత పాఠశాలల హెచ్‌ఎంలు మోహన్‌రావు, దేవ దాసు, మంగీలాల్, రామచంద్రసింగ్, అజ్మీర జగన్‌నాయక్, స్వర్ణలత, పద్మ, జైల్‌సింగ్, రమేశ్‌బాబు, విజయనిర్మల పాల్గొన్నారు.
విజేతగా నిలిచిన
హనుమాతండా పాఠశాల