పదేళ్ల క్రితం మరమ్మతులు
గేట్లకు పదేళ్ల క్రితం మరమ్మతులు నిర్వహించారు. నాలుగైదు ఏళ్లకోసారి మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా జెన్‌కో అధికారులు పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్‌లోని నీటిమట్టం 393 అడుగుల లోపు ఉంటేనే పనులు చేపట్టేందుకు వీలవుతుంది. అంతకంటే ఎక్కువగా పెరిగితే పనులు సాధ్యం కావని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఒకటో గేటు నుంచి నాలుగో గేటు వరకు, 13వ నంబర్ గేటు మధ్య పిల్లర్లకు బీటలు వారాయి. దీంతో పిల్లర్ల మధ్య నీటి చెమ్మ అధికంగా కన్పిస్తోంది. గేట్ల మధ్య రబ్బర్ సీల్స్ కూడా లీకవుతుండటంతో రిజర్వాయర్ నుంచి నీరు వృథాగా పోతోంది. అయితే ఈ లీకులతో ప్రమాదమేమీ లేదని కేటీపీఎస్ అధికారులు చెబుతున్నా రు. రిజర్వాయర్‌లో నీటిమట్టం 400 అడుగులకు మించి పెరిగినప్పుడే బీటలనుంచి నీళ్లు బయటకు వస్తాయని పేర్కొంటున్నారు. పరీవాహక గ్రామాల ప్రజ లు, ఆయకట్టు రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే మరమ్మతులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. కాగా పిల్లర్ల మరమ్మతులు, ఇతర పనుల కోసం ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభు త్వ పథకం డ్రిప్ ఇరిగేషన్ కింద రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపారు. కానీ నిధులు మంజూరు కాలేదు.


