అవకాశాలను అందిపుచ్చుకోవాలి
మణుగూరుటౌన్: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు ప్రభుత్వ ఐటీఐలోని ఏటీసీ కేంద్రాన్ని సందర్శించారు. కోర్సుల వివరాలు, అందుకు సంబంధించిన యంత్ర పరికరాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఇక్కడి విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ వివరాలు, విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. శిక్షణతో యువతకు భవిష్యత్ ఉటుందని ఆయన పేర్కొన్నారు. ఏటీసీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని వివరించారు. ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రవి, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు ఏసుపాదం, పీవీకే శర్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.


