గుర్తు తెలియని వ్యక్తి మృతి
కొత్తగూడెంఅర్బన్: విజయవాడ నుంచి భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన ప్యాసింజర్ రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జీఆర్పీ ఎస్‌ఐ జె.సురేశ్ కథనం ప్రకారం.. స్థానిక రైల్వేస్టేషన్‌కు వచ్చిన రైలులో 40 – 45 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందగా.. 108 సిబ్బంది వచ్చి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని జీఆర్‌పీ అధికారి అశోక్, ఆర్పీఎస్ ఏఎస్‌ఐ ప్రభాకర్‌రావు కలిసి సర్వజన ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదుతో జీఆర్‌పీ ఎస్‌ఐ సురేష్ కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి బ్యాగ్‌లో పోతురాజు శ్రీను అనే పేరుతో ఆధార్ జిరాక్స్ ఉన్నట్లు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి వంటిపై బ్లాక్ కలర్ టీ షర్టు, బ్లూ రంగు ట్రాక్ పాయింట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధించిన వారు ఎవరైనా ఉంటే 87126 58606 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
పురుగులమందు తాగిన వ్యక్తి ..
దమ్మపేట: కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగులమందు తాగిన వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని గుర్వాయిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గుర్వాయిగూడెం గ్రామానికి చెందిన కుర్సం వీరస్వామి (80) కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన తీవ్ర మనస్తాపం చెంది పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు వీరభద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.
గాయపడిన వ్యక్తి..
పాల్వంచరూరల్: రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇసీ్త్ర చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మండలంలోని నాగారంకాలనీవాసి నిమ్మ ల ముత్యం (42) గురువారం సాయంత్రం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా పాల్వంచ నుంచి బంజరవైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెంనకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సైదమ్మ కొన్ని నెలల క్రితం చనిపోయింది. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి బంధువు నిమ్మల సుధాకర్ ఫిర్యాదు మేరకు శనివారం ప్రమాదానికి కారణమైన మెడ సర్వేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి


