నేటి నుంచి పర్ణశాలలో అధ్యయనోత్సవాలు
దుమ్ముగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి అనుబంధ ఆలయంగా ఉన్న పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శనివారం నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. 9 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో రోజుకో అలంకరణలో స్వామి భక్తులకు దర్శనమిస్తారు. చలువ పందిళ్లు వేసి, ఉత్తరద్వారం వైపు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నెల 29వ తేదీన గోదావరి తీరంలో తెప్పోత్సవం, 30వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇన్‌చార్జ్ వాసు వెల్లడించారు. శనివారం మత్స్య అవతారంలో స్వామి దర్శనమివ్వనున్నారు.
ముక్కోటి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి


