
కాయకల్ప బృందం పరిశీలన
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కాయకల్ప బృందం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. స్వచ్ఛత, సదుపాయాలు, బయో మెడికల్ వేస్టేజ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, పారిశుద్ధ్య, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి తదితర అంశాలపై పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. గత నెలలోనే కాయకల్ప ఇంటర్నల్ పీర్ అసెస్మెంట్ జరగగా, అందులో క్వాలిఫై కావడంతో ఎక్సటర్నల్ అసెస్మెంట్ జరిగింది. ఇందులో ప్రథమ ర్యాంక్ వస్తే రూ. 15 లక్షలు, ద్వితీయ ర్యాంక్ వస్తే రూ.10 లక్షలతో పాటు ఇందులో పాల్గొన్నందుకు రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు డాక్టర్ నిరంజన్, శ్రీకాంత్ రాజు, రాధిక శర్మ, స్వామి, ఆస్పత్రి వైద్యులు రాజశేఖర్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.