
అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలి
ములకలపల్లి: అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇవ్వాలని తెలంగాణా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలపరిధిలోని మాదారం గ్రామంలో తెలంగాణా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మండల సదస్సులో మాట్లాడారు. సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అన్నవరపు కనకయ్య, తెలంగాణా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండబోయిన వెంకటేశ్వర్లు, పార్టీ ములకలపల్లి, పాల్వంచ మండలాల కార్యదర్శులు ముదిగొండ రాంబాబు, పాకాల వెంకట్రావు, ఊకంటి రవికుమార్, మాలోతు రావూజా, నిమ్మల మధు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణా రైతు సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్