ఖమ్మంక్రైం: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన ఓ వ్యక్తి రిటైర్డ్ ఉద్యోగి వద్ద కేర్ టేకర్‌గా చేరి ఆయనకు తెలియకుండా ఖాతా నుంచి రూ.11.49 లక్షలు స్వాహా చేశాడు. ఈమేరకు నిందితుడిని సోమవారం ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. మధిర మండలం నిదానపురానికి చెందిన గుండా వెంకటేశ్వరరెడ్డి ఖమ్మం హోమ్ కేర్ సర్వీస్‌లో కేర్ టేకర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత నాలుగైదేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆయన గత మార్చిలో ఖమ్మంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి గాదె కేశవరావు వద్ద కేర్ టేకర్‌గా చేరాడు. యజమానిని నమ్మిస్తూ ఆయన ఫోన్‌లోని గూగుల్ పే ద్వారా బెట్టింగ్ యాప్‌ల్లోకి డబ్బు డిపాజిట్ చేయడం మొదలుపెట్టాడు. రెండు వారాల పాటు వరుసగా రూ.11.49 లక్షల డిపాజిట్ చేయగా, లాభాలు రాకపోవడంతో ఉద్యోగం మానేశాడు. కొన్నాళ్ల తర్వాత గుర్తించిన కేశవరావు ఈ విషయమై చేసిన ఫిర్యాదుతో వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కోర్టులో హాజరుపర్చగా, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్‌ను, ఎస్సైలు రంజిత్‌కుమార్,విజయ్‌కుమార్, సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.