
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ నష్టం
ఇల్లెందు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణం దగ్ధమైంది. ఇలెందు మొయిన్‌రోడ్‌లోని శ్రీ ఆదిత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌లో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. దుకాణంలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు.. సుమారు రూ.2.70 కోట్ల సరుకు కాలిపోయినట్లు అంచనా. అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, సోమవారం ఏఓ సతీశ్ దుకాణాన్ని పరిశీలించి రికార్డుల ఆధారంగా నష్టంపై అంచనా వేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, అగ్నిమాపకశాఖ అధికారి నవీన్, డీఎస్పీ చంద్రభాను, సీఐ సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఏడీఈ కోటేశ్వరరావు పరిశీలించి వివరాలు ఆరా తీశారు. దుకాణంలోని 80 శాతం సరుకు అగ్నికి ఆహుతైందని యజమాని ప్రొద్దుటూరి నాగేశ్వరరావు తెలిపారు.
ఫర్టిలైజర్ షాప్‌లో రూ.కోట్ల విలువైన
సామగ్రి దగ్ధం