అంగన్‌వాడీ సిబ్బంది సేవలు ప్రశంసనీయం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ సిబ్బంది సేవలు ప్రశంసనీయం

May 15 2025 12:06 AM | Updated on May 15 2025 12:06 AM

అంగన్

అంగన్‌వాడీ సిబ్బంది సేవలు ప్రశంసనీయం

కొత్తగూడెంఅర్బన్‌: అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయినుల సేవలు ప్రశంసనీయమని జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా అన్నారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన సీడీపీఓ కనకదుర్గ, హెడ్‌ మాస్టర్‌ మేకల జ్యోతి రాణి, రేగళ్ల అంగన్‌వాడీ టీచర్‌ రమాదేవిలను ఐసీడీఎస్‌ లక్ష్మీదేవిపల్లి సెక్టార్‌ –1 ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడారు. పాల్వంచ సీడీపీఓ లక్ష్మీప్రసన్న, సూపర్‌ వైజర్‌ ఓ.రమాదేవి, అంగన్వాడీ టీచర్‌ పద్మ తదితరులు పాల్గొన్నారు.

అవసరానికి మించి

ఎరువులు వాడొద్దు

సత్తుపల్లిరూరల్‌: సాగు చేసే పంటలు, భూసా రం ఆధారంగా అధికారులు, శాస్త్రవేత్తల సిఫా రసు మేరకు ఎరువులు ఉపయోగించాలని, అంతకు మించి వాడితే ఫలితం ఉండకపోగా ఖర్చు పెరుగుతుందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జె.హేమంత్‌కుమార్‌ అన్నారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా గంగారం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట మార్పిడి చేయడంతో పాటు పంట అవశేషాలను కలియదున్నితే భూసారం పెరుగుతుందన్నారు.

సెల్‌ ఫోన్లు రికవరీ

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 150 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బుధవారం బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో గత రెండు నెలల వ్యవధిలో పోగొట్టుకున్న 150 మంది ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. గడిచిన ఐదు నెలల్లో మొత్తం 743 మొబైల్‌ ఫోన్లను కనిపెట్టి బాధితులకు అందించామన్నారు. రికవరీ చేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, రాము, ఎస్సై సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

అశ్వారావుపేటరూరల్‌: మండల పరిధిలోని నారంవారిగూడెం కాలనీ గ్రామ శివారులో ఓ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బుధవారం పోలీసులు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. రూ.3100 నగదు, రెండు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు.

పేకాటరాయుళ్లపై

కేసు నమోదు

దమ్మపేట: మండల పరిధిలోని బాలరాజుగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వ్యక్తులపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. దమ్మపేట, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారయ్యాడు. రూ.17,500 నగదు, ఆరు మొబైల్‌ ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు. కాగా పేకాటరాయుళ్లలో మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు.

సీఐల బదిలీ,

పోస్టింగ్‌

ఖమ్మం క్రైం: పోలీసు శాఖలోని మల్టీజోన్‌–1 పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కరీంనగర్‌ పీటీసీలో ఆన్‌ డ్యూటీపై ఉన్న జి.శ్రీకాంత్‌గౌడ్‌ను ఖమ్మం ట్రాఫిక్‌ సీఐగా కేటాయించారు. అలాగే, ఖమ్మం టాస్క్‌ఫోర్‌ సీఐగా వెయింటింగ్‌లో ఉన బి.బాలాజీని నియమించారు. అంతేకాకుండా కొత్తగూడెం టుటౌన్‌ సీఐగా వెయిటింగ్‌లో ఉన్న డి.ప్రతాప్‌ను నియమించారు. ఈ స్థానంలో ఉన్న టి.రమేష్‌కుమార్‌ను ఐజీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

అంగన్‌వాడీ సిబ్బంది సేవలు ప్రశంసనీయం1
1/1

అంగన్‌వాడీ సిబ్బంది సేవలు ప్రశంసనీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement