
●ఫోన్ చేశాకే తృప్తి
పాల్వంచరూరల్ : పాల్వంచ మండలం రెడ్డిగూడెంకు చెందిన సోమ వీరారెడ్డి – శోభాదేవి కుమారుడు అవినాష్‌రెడ్డి రైతు కుటుంబంలో పుట్టి ఆర్మీలో చేరాడు. 2015లో సైనికుడిగా ఎంపికై న ఆయన జమ్మూకశ్మీర్, లడక్, రాజస్తాన్‌లో విధులు నిర్వర్తించాక ప్రస్తుతం కలకత్తాలో ఉన్నాడు. యుద్ధం నేపథ్యాన సిద్ధంగా ఉండాలనే సంకేతాలు రావడంతో.. ప్రతీరోజు ఫోన్‌లో క్షేమ సమాచారం తెలుసుకునే వరకు ఆందోళన తగ్గడం లేదని అవినాశ్ తల్లి శోభాదేవి తెలిపారు. పాకిస్తాన్ పీచమణిచేలా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మనదే పైచేయి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.