
ప్రజాసమస్యలు పరిష్కరించాలి
ప్రజా సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు.
8లో
మరింత ప్రణాళికాయుతంగా..
హరితహారం కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రధానంగా వాసి కంటే రాశి మీదనే దృష్టి కేంద్రీకృతమైంది. గతంలో పాఠశాల్లలో కానుగ, వేప వంటి నీడ నిచ్చే చెట్లనే ఎక్కువగా నాటేవారు. ఆ తర్వాత వీటిని పట్టించుకునే అంశంపై అంతగా శ్రద్ధ పెట్టేవారు కాదు. కానీ గతేడాది ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చి, ఆయా ప్రదేశాల్లో పరిస్థితులు, అక్కడి ప్రయోజనాల ఆధారంగా మొక్కలు నాటడంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా స్కూళ్లలో మునగ, తులసి, కలబంద, ఉసిరి, కరివేపాకు వంటి చెట్లను నాటారు. గతంలో పోల్చితే ఈ ప్రయోగం పాఠశాలల్లో విజయవంతమైంది. అనేక స్కూళ్లలో గతేడాది నాటిన చెట్లు బతికి ఉండటంతో పాటు తమవంతు ప్రయోజనాలు అందిస్తున్నాయి. దీంతో ఈసారి వన మహోత్సవంలో మరింత ప్రణాళికాయుతంగా ఈ పని చేయబోతున్నారు. ఎకై ్సజ్ శాఖ తాటి, ఈత చెట్లు, ఇరిగేషన్ శాఖ సుబాబుల్, వట్టి వేర్లు, అటవీశాఖ వెదురు, విద్యాశాఖ ఔషధ మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రైతులను సైతం భాగస్వాములను చేసేందుకు ఎర్ర చందనం, టేకు, వెదురు మొక్కలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.