
చేకూరి కాశయ్య ఆదర్శప్రాయుడు
చుంచుపల్లి: రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కాశయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కాశయ్య మానవతావాది అని, నేటితరం రాజకీయ నాయకులకు మార్గదర్శకుడని పేర్కొన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేకూరి కాశయ్య సేవలు ఎనలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు, కృష్ణమోహన్, కోటేశ్వరరావు, రజాక్, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేశ్వరరావు, కొదమ సింహం పాడురంగా చార్యులు, గురుదక్షిణ ఫౌండేషన్ సభ్యులు, చేకూరి కాశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సామాజికవర్గం అభివృద్ధి కోసం కృషి
చేయాలి: తుమ్మల
సమాజసేవతోపాటు కమ్మ సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మినీ కల్యాణ మండపానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. కల్యాణ మండప నిర్మాణానికి చేయూతనందించేందుకు ముందుకొచ్చిన మాచవరం కోటేశ్వరరావును శాలువాతో సన్మానించారు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, బిక్కసాని నాగేశ్వరరావు, కృష్ణమోహన్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, కమ్మ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు