
సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం
ఖమ్మం స్పోర్ట్స్: ఏ రంగంలోనైనా అభివృద్ధి ఒక్కరితో సాధ్యం కాదని, సమష్టి కృషి కీలకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్, టేబుల్ టెన్నిస్ హాల్ నిర్మాణానికి శుక్రవారం ఆయన ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో శంకుస్థాపన చేశాక మాట్లాడారు. పటేల్ స్టేడియంలో శిక్షణ పొందిన ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని.. వారికి మరిన్ని సౌకర్యాలు సమకూర్చేలా కృషి చేస్తానని తెలిపారు. సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ 8.50 కోట్లు, టేబుల్ టెన్నిస్ హాల్ నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. కాగా, క్రికెట్ శిక్షణకు 20 ఎకరాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ సింథటిక్ ట్రాక్‌తో క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందుతుందని తెలిపారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడగా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుట్టా శంకరయ్య, కె.క్రిస్టోఫర్‌బాబు, కోచ్‌లు, క్రీడాసంఘాల ప్రతినిధులు ఎం.డీ.గౌస్, ఎం.డీ.అక్బర్ అలీ, నున్నా రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, షఫీక్ అహ్మద్, కర్నాటి వీరభద్రం, చంద్రశేఖర్, ఆదర్శ్‌కుమార్, వీవీఎస్.మూర్తి, ఎం.డీ.మతిన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం కప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మంత్రి, ఎంపీ పతకాలు అందజేయగా.. వేసవి శిబిరంలో బ్యాడ్మింటన్ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు అసోసియేషన్ తరఫున టీషర్ట్‌లు అందించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,
ఎంపీ రఘురాంరెడ్డి
ఖమ్మం స్టేడియంలో సింథటిక్ ట్రాక్
నిర్మాణానికి శంకుస్థాపన