
ప్రయాణికులకు చేరువగా..
● క్యూఆర్ కోడ్‌తో ఆర్టీసీ సేవల వివరాలు ● కోడ్ ముద్రించిన కీచైన్లు, టేబుల్ క్యాలెండర్ల పంపిణీ
భద్రాచలంఅర్బన్: ఆర్టీసీ సంస్థ ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటోంది. క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా సేవలందిస్తూ వినియోగదారులకు మరింత చేరవయ్యే ప్రయత్నం చేస్తోంది. క్యూఆర్ కోడ్ ముద్రించిన కీ చైన్, క్యాల్లెండర్లను కస్టమర్లకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆర్టీసీ అందిస్తున్న పదిరకాల యాప్‌లు తెరపై కనిపిస్తాయి. ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్, గమ్యం, ఆన్‌లైన్ బుకింగ్ యాప్, ఆర్టీసీ ఇన్‌స్ట్రాగాం, ఎక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్ చానల్ ఖాతాలు ఉంటాయి. మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ తదితర వివరాలు పొందుపరిస్తే వినియోగించుకోవడం సులభమవుతుంది. సాధారణంగా ఫ్లెక్సీల రూపంలో, ఇతర విధానాల్లో ప్రచారం చేస్తే అంతగా చేరుతుందో లేదోననే కారణంతో ఆర్టీసీ అధికారులు క్యూఆర్ కోడ్‌తో ప్రచారం చేస్తున్నారు.
సేవలిలా..
క్యూఆర్ కోడ్ సాయంతో వివిధ రకాల సేవలు పొందొచ్చు. ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుంది? గమ్యానికి ఇంకా ఎంత సమయంలో చేరుకుంటుంది? వంటి వివరాలను తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో నడుస్తున్న సంస్థ బస్సుల వివరాలు, సమాచారం లభిస్తుంది. ఆన్‌లైన్‌లో టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. సలహాలు, సూచనలతోపాటు, ఫిర్యాదులు ఇచ్చేందేకు ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వేదికలను వినియోగించుకోవచ్చు. వివాహాది శుభకార్యాలతోపాటు విహార యాత్రలకు బస్సులను రాయితీ విధానంలో తక్కువ ధరకే బుకింగ్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు సహకరించాలి
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. ఈ క్రమంలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సంస్థకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట పొందేలా ఏర్పాట్లు చేశాం. ఇది మరింత చేరువయ్యేందుకు కీచైన్లు, టేబుల్ క్యాలెండర్లు రూపొందించాం. ప్రయాణికులకు పంపిణీ చేస్తున్నాం. ప్రజలు సంస్థ ఉన్నతికి సహకరించాలి.
– తిరుపతి, డిపో మేనేజరు, భద్రాచలం

ప్రయాణికులకు చేరువగా..

ప్రయాణికులకు చేరువగా..