
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం జరిపారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఈఓ రజనీకుమారి, భక్తులు పాల్గొన్నారు.
నేడు శనీశ్వరునికి తైలాభిషేకం
పెద్దమ్మగుడి సముదాయంలోని శివాలయంలో శనిత్రయోదశి సందర్భంగా శనివారం శనీశ్వరుడికి తైలాభిషేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు.
న్యాయమూర్తిని
కలిసిన పోలీసులు
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లును కోర్టు హాల్‌లో శుక్రవారం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, ఇతర పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐలు ఎం.కరుణాకర్, వెంకటేశ్వర్లు, శివప్రసాద్ పాల్గొన్నారు.
పెండింగ్ సమస్యల
పరిష్కారానికి కృషి
మణుగూరుటౌన్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల లాభాల వాటా అందించామని, పెండింగ్‌లోని అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఐఎన్‌టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ అన్నారు. శుక్రవారం ఓసీ–2లో ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన గేట్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వేల కుటుంబాల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని, దానిని కాపాడుకునే బాధ్యత కార్మికులపైనే ఉందన్నారు. సమావేశంలో మల్లికార్జున్, షాబుద్దీన్, షేక్ అబ్దుల్ రవూఫ్, బానోత్ కృష్ణ, బుర్ర వెంకటేశ్వర్లు, జయరాజు, మిట్టపల్లి శ్రీను, జీవరత్నం, రామారావు, సంతోష్ చరణ్, పొదిల రామకృష్ణ, జంపాల శ్రీను, తాళ్లూరి రాము, యాకూబ్‌పాషా, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

స్వర్ణ కవచధారణలో రామయ్య

స్వర్ణ కవచధారణలో రామయ్య

స్వర్ణ కవచధారణలో రామయ్య