కుక్క పిల్లను లాలిస్తున్న వానరం
డీఎస్పీ జవహర్‌లాల్ మృతి తీరని లోటు
రఘునాథపాలెం: ప్రజలకెంతో సేవ చేసే మంచి అధికారిని కోల్పోవడం తీరని లోటు అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, విత్తన, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ సోదరుడు డీఎస్పీ జవహర్‌లాల్ సంతాపసభ ఆదివారం మండలంలోని ఆయన స్వగ్రామం ఈర్లపుడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్ చిత్రపటానికి పూలమాల వేసిన వారు మాట్లాడారు. నివాళులర్పించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ వై.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మదనలాల్, లింగాల కమల్‌రాజు, గుండాల కృష్ణ, నాగండ్ల కోటేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బచ్చు విజయ్‌కుమార్, గుత్తా రవి, మెంటం రామారావు, చెరుకూరి ప్రదీప్, తాత వెంకటేశ్వర్లు, దయాకర్, మాటేటి కిరణ్, అబ్బాస్, నరసింహారావు, వెంకటేశ్వర్లు, చిన్నా, శ్రీనివాస్, వాంకుడోత్ దీపక్, పుచ్చకాయల వీరభద్రం, పోటు లెనిన్, మల్లికార్జున్‌రావు, బానోతు మంజుల, తనయ్‌రాదే, ఆకాంక్ష, రామకోటి, సుందర్‌లాల్, మంగీలాల్, మోతీలాల్, మణిలాల్ తదితరులు ఉన్నారు.