బాపట్ల: క్రైస్తవ్యం మతం కాదని.. సన్మార్గమని దిసాల్వేషన్ ఆర్మీ బాపట్ల నాయకులు మేజర్ వంపుగూడి యేసుపాదం పేర్కొన్నారు. బాపట్ల క్రైస్తవ నాయకుల రన్ ఫర్ జీసస్–2026 సదస్సుకు సంబంధించిన కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేజర్ వంపుగూడి యేసుపాదం మాట్లాడుతూ.. ఏప్రిల్ 4వ తేదీన జరిగే క్రీస్తు ప్రేమను చాటే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గేరా మణి భూషణ్, కన్వీనర్ ఎఫ్ డబ్ల్యూ కోల్, బెనర్జీ మీనన్, రెవ రాహుల్ దేవ్, రెవ దాసరి కిషోర్, రెవ గడ్డం ఏలియా, రెవ జైపాల్, రెవ హనోక్, రెవ సుధాకర్, రెవ శామ్యూల్, రెవ దయాకర్, డాక్టర్ కాగిత వరప్రసాద్, చేగుడి బాబురావు, మాతంగి డేనియల్, జాకబ్ జయాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.


