ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

Mar 27 2026 8:51 AM | Updated on Mar 27 2026 8:51 AM

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

భట్టిప్రోలు: భట్టిప్రోలు–రేపల్లె జాతీయ రహదారి 216 ఏ సహా ఇతర రహదారుల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి. వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన రహదారిని పరిశీలించారు. ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో అందుకు కారణాలు తదితర వివరాలను పోలీస్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మళ్లీ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మైనర్ల డ్రైవింగ్‌ను కట్టడి చేయాలన్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆయన వెంట రేపల్లె ఆర్డీవో శ్రీదేవి, సీఐలు వేమూరు, రేపల్లె పీవీ ఆంజనేయులు, సురేష్‌బాబు, ఎస్‌ఐ ఎం.శివయ్య, తహసీల్దార్‌ మేకా శ్రీనివాసరావు, కొల్లూరు తహసీల్దార్‌, పలువులు ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పంచాయతీ భూముల పరిశీలన

బాపట్ల: సూర్యలంక అడవి రెవెన్యూ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ పరిశీలించారు. గురువారం మైరెన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. సర్వే నెంబర్‌ 547/3ఏ7 లో ఉన్న 4 ఎకరాల 3 సెంట్లు ప్రభుత్వ భూమిని మ్యాప్‌ ద్వారా మండల సర్వే అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నిర్మితమైన శివాలయం, మైరెన్‌ పోలీస్‌స్టేషన్‌, ఫిష్‌ ఆంధ్రషాపులు, పంచాయతీ స్థలం, బీచ్‌ వద్ద తుపాను రక్షణ భవనాన్ని, తుపాను రక్షణ భవనంలోని రెండు అంతస్తులు గల ప్రతి గదిని ఆయన పరిశీలించారు. సర్వే నెంబర్‌ 547/3ఏ7లో గల 4.03 సెంట్లు పంచాయతీ స్థలంలో గల శివాలయం, మెయిన్‌ పోలీస్‌ స్టేషన్‌, ఫిష్‌ ఆంధ్ర షాపులు మరియు ఖాళీ ప్రదేశం మొత్తం 3 ఎకరాల ప్రాంతం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయాలని, వాటికి సంబంధించి అంచనా తయారు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆక్రమణలు తొలగించాలని సూచించారు. శివాలయ నిర్మాణంపై ఆరా తీశారు. బాపట్ల రెవెన్యూ డివిజన్‌ అధికారి గ్లోరియా, బాపట్ల మండల రెవెన్యూ అధికారి సలీమా, ఇన్‌చార్జి పంచాయతీరాజ్‌ డీఈ రామారావు, బాపట్ల ఎంపీడీవో బాబురావు, బాపట్ల మండల సర్వేయర్‌ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

రేపల్లె: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సూచించారు. రేపల్లె బాపట్ల జాతీయ రహదారిలోని శివంగులపాలెం, కన్నెగంటివారిపాలెం, ఓలేరు వద్ద ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించి అధికారులతో చర్చించారు. ఆర్డీవో బూసి శ్రీదేవి, డీటీవో పరంధరామిరెడ్డి, భట్టిప్రోలు ఇన్‌చార్జి తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ అండ్‌ బీ డీఈ రాజేష్‌, ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement