కారంచేడు: బాణసంచా గోదాములపై చీరాలకు చెందిన పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్‌నాయుడు, చీరాల డీఎస్పీ మొహ్మద్ మొయిన్, ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ ఏకకాలంలో కారంచేడు మండలంలోని టపాసుల నిల్వల గోదాములపై దాడులు నిర్వహించారు. దాడుల్లో నిల్వ ఉండాల్సిన చోట కాకుండా రహస్య ప్రాంతాల్లో అక్రమ నిల్వలు ఉంచారనే సమాచారంతో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మండలంలోని స్వర్ణ, కారంచేడు గ్రామాల్లోని మూడు చోట్ల జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచి న మందుగుండు సామగ్రి పెద్ద మొత్తంలోనే కను గొన్నట్లు సమాచారం. దీంతో అధికారులు అక్రమ నిల్వలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. వీరితోపాటు ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, కారంచేడు తహసీల్దారు జీ నాగరాజు, సంబంధిత అధికారులు, రెవెన్యూ, ఫైర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


