రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు | - | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు

Feb 1 2026 3:25 AM | Updated on Feb 1 2026 3:25 AM

రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు

రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు

రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు

సబ్‌ జూనియర్‌ విభాగంలో గుంటూరు ఎడ్లకు ప్రథమస్థానం

రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురష్కరించుకుని శనివారం స్థానిక సెయింట్‌ జోసఫ్స్‌ ఉన్నత పాఠశాల క్రీడామైదానం లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా జరిగాయి. సబ్‌ జూనియర్‌ విభాగంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎద్దులు 3,606 అడుగుల దూరంలాగి ప్రథమ బహుమతి రూ. 90 వేలను కై వశం చేసుకున్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 3,300 అడుగుల దూరంలాగి రెండవ బహుమతి రూ. 70 వేలు, తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా మండల కేంద్రమైన పెదకొత్తపల్లికు చెందిన వి.శ్రావన్‌కుమార్‌, చంద్రకళ ఎడ్లు 3,080.8 అడుగుల దూరం లాగి 3 వ బహుమతి రూ. 50 వేలు, వైఎస్సార్‌ కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ల శివకృష్ణ యాదవ్‌, పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన యామిని మోహన్‌ శ్రీ కంబైన్డ్‌ ఎడ్లు 3,057.2 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ. 35 వేలు, హైదరాబాద్‌కు చెందిన డి.రోహన్‌బాబు ఎడ్లు 3,008.9 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ. 25 వేలను గెలుచుకున్నాయి. కమిటీ సభ్యులు వైఎల్‌ మర్రెడ్డి, గొంటు సుమంత్‌ రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, బొడపాటి రామకృష్ణ, జడ్డు రాజేష్‌రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా సురపనేని రాధాకృష్ణ, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావు వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement