ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి సన్మానం
బాపట్లటౌన్: పోలీస్‌శాఖలో మూడు దశాబ్ధాలకు పైగా సేవలు అందించడం హర్షనీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ విభాగంలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన అడిషనల్ ఎస్పీ బి.రామాంజనేయులు, ఏఆర్ డీఎస్పీ పి.విజయసారథి, ఏఎస్‌ఐ పి.సత్యనారాయణమూర్తిలను శనివారం సన్మానించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకున్నదని చెప్పారు. ప్రజలకు నేరుగా సేవలు అందించడం పోలీసు ఉద్యోగంలోనే జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి ఉద్యోగంలో మనం చేరడం చాలా గొప్ప అదృష్టంగా భావించాలని అభిప్రాయపడ్డారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపాలని, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు, ఎటువంటి సమస్య వచ్చిన నేరుగా తమను కలవవచ్చన్నారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎం.డి.మెయిన్, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్‌నాయక్ పాల్గొన్నారు.


