
రైలులో అశోక్‌బాబు ప్రయాణం
భట్టిప్రోలు: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కల్తీ మద్యంపై నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబుకు పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. సోమవారం రేపల్లె నియోజక వర్గంలోని చెరుకుపల్లిలోని ఇంటి నుంచి వేమూరుకు వాహనంలో వస్తుండగా భట్టిప్రోలులో అడ్డు పడ్డారు. దీంతో ఆయన ఉదయం 9:30 గంటలకు భట్టిప్రోలు రైల్వే గేటు నుంచి కాలి నడకన రైల్వే స్టేషన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి తరలి వచ్చారు. రేపల్లె నుంచి గుంటూరు వెళ్లే రైలు బండిని భట్టిప్రోలు ఎక్కి వేమూరులో దిగారు. ప్రయాణికులను కలసి వారిని కుశల ప్రశ్నలు వేశారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.