బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Oct 12 2025 7:12 AM | Updated on Oct 12 2025 7:14 AM

ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ పులిచింతల ప్రాజెక్టు సమాచారం ప్రత్తిపాడు: ‘‘ మేము ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉంటాం. ఇక్కడ మీరు ఉన్నారు. బాధ్యతగా ఉంటారనే కదా మా పిల్లల్ని మీ దగ్గర (హాస్టల్‌)లో వదిలేసి వెళ్లాం. ఆహారం కలుషితమై ఆస్పత్రిపాలైతే కనీసం మాకు సమాచారం ఇవ్వలేదు. ఇదేనా మీకు పిల్లలమీద ఉన్న బాధ్యత ? ఇక్కడ ఉంచి మా పిల్లల్ని మేం చంపుకోలేం’’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా సంక్షేమశాఖ అధికారి మయూరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడే ఉంచి మా పిల్లల్ని చంపుకోమంటారా.. అంటూ మండిపడ్డారు. పెదనందిపాడు మండలం అన్నపర్రులోని బీసీ బాలుర వసతి గృహంలో శుక్రవారం అస్వస్థతకు గురైన 54 మందిలో చికిత్స అనంతరం సాయంత్రానికి కొందరిని డిశ్చార్జ్‌ చేశారు. మరికొందరిని జీజీహెచ్‌కి రిఫర్‌ చేశారు. శిబిరంలో ఉన్న 24 మందిలో నలుగురిని అదేరోజు రాత్రి జీజీహెచ్‌కి తరలించారు. శనివారానికి కూడా మరో ఐదుగురికి కడుపునొప్పి తగ్గకపోవడం, బీపీ డౌన్‌ అవుతుండటంతో 108 వాహనంలో గుంటూరు సమగ్ర వైద్యశాలకు తరలించారు. ఇంకా శిబిరంలో 15 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద గుంటూరు జీజీహెచ్‌లో 26 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నట్లు వైద్యాశాఖ అధికారులు తెలిపారు. తమ పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఉదయానికి అన్నపర్రులోని బీసీ హాస్టల్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న తమ పిల్లలతో మాట్లాడారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇంతలో అక్కడకు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి మయూరి వచ్చారు. దీంతో ఆమైపె విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇంతటి ఘటన జరిగితే కనీసం తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్క ఫోన్‌ చేసే తీరిక మీ వార్డెన్‌కు గానీ సిబ్బందికి, అధికారులకు లేదా? అని ప్రశ్నించారు. ఇంతటి నిర్లక్ష్యం ఏమిటని, ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారని? ఆగ్రహించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో హాస్టల్లో మా పిల్లలను ఉంచలేమని, మాతో ఇంటికి తీసుకువెళ్లిపోతా’’మని బీసీ సంక్షేమశాఖ అధికారి మయూరికి తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. స్పందించిన ఆమె అలా పంపిచడానికి కలెక్టర్‌ పర్మిషన్‌ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళితే మొత్తానికే తీసుకెళ్లిపోవడమేనని, ఇక మళ్లీ హాస్టల్‌కు రావడం ఉండదు.. స్కూల్‌కు వెళ్లడం ఉండదంటూ బెదిరింపు ధోరణిలో యమూరి సమాధానమిచ్చారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఇక్కడ ఉంచి మా పిల్లల్ని చంపుకోలేమని తల్లిదండ్రులు నిప్పులు చెరిగారు. వెంటనే ఇక్కడి నుంచి వార్డెన్‌ను, కుక్‌ను తొలగించేస్తామని, ఇకపై ఎలాంటి ఇబ్బందులుండవని మయూరి తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఇదిలా ఉంటే ప్రత్యేక వైద్య శిబిరం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కల్యాణ మండపంలో బల్లలపై నొప్పులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు చలించిపోయారు. ‘‘ఆయ్యా.. మీకు పుణ్యముంటది.. మా పిల్లలను మాతో పంపించండి. మేము తీసుకువెళ్లి చికిత్స చేయించుకుంటా’’మంటూ నెత్తీనోరూ బాదుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఉన్నా కొందరికి శనివారం వరకు కూడా నొప్పులు తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై తమ వెంట తీసుకువెళతామంటూ పట్టుబట్టారు. అయితే, అందుకు కలెక్టర్‌ అనుమతి కావాలంటూ అధికారులు తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.

జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ మండిపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడే ఉంచి మా పిల్లల్ని చంపుకోమంటారా ? పిల్లలు అస్వస్థతకు గురై ఊసురోమంటుంటే కనీసం సమాచారం కూడా ఇచ్చే తీరిక, బాధ్యత మీకు లేదా ? పిల్లలతో అంట్లు తోమిస్తారా, బల్లులు పడిన నీళ్లు తాగమంటారా ? వార్డెన్‌, కుక్‌ ఉంటే పిల్లల్ని ఇక్కడ ఉంచం వార్డెన్‌, కుక్‌లపై విస్తుపోయేలా ఆరోపణలు చేసిన విద్యార్థులు

న్యూస్‌రీల్‌

మీకో దండం.. మీ హాస్టల్‌కో దండం !

హాస్టల్‌లో పరిస్థితులు సరిగాలేకపోవడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు ఇంటిబాట పట్టారు. కొందరు ఉదయాన్నే బ్యాగులు సర్దుకుని హాస్టల్‌ నుంచి ఇళ్లకు వెళ్లిపోగా, మరికొందరిని తల్లిదండ్రులు తీసుకువెళ్లిపోయారు. సుమారు 23 మంది విద్యార్థులు హాస్టల్లో ఉండలేమంటూ వెళ్లిపోయారు. అనంతరం హాస్టల్‌కు చేరుకున్న బీసీ సంక్షేమశాఖ అధికారి మయూరి వార్డెన్‌ మార్కండేయులుతో పాటు, ఏబీసీడబ్ల్యూపై మండిపడ్డారు. ‘‘ఇది హాస్టల్‌ అనుకుంటున్నారా.. లేక మీ ఇళ్లు అనుకుంటున్నారా..? పిల్లల్ని ఎవ్వరి అనుమతితో ఇంటికి పంపించారు..?’’ అంటూ సిబ్బందిపై ఫైర్‌ అయ్యారు. వెంటనే వెళ్లిన పిల్లల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వెనక్కు రప్పించాలని, మిగిలిన పిల్లలు ఎక్కడెక్కడున్నారో వెతికి పట్టుకుని హాస్టల్‌కు తీసుకురావాలని ఆదేశించారు.

ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

జె.పంగులూరు: మండల పరిధి కొండమంజులూరు జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులకు 365 సైకిళ్లను శనివారం ఉచితంగా అందించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పాల్గొన్నారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 74,106 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 82,090 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.

ఫోన్‌ చేసే బాధ్యత లేదా ?

మా పిల్లల్ని మాతో పంపించండి !

7

బాపట్ల1
1/8

బాపట్ల

బాపట్ల2
2/8

బాపట్ల

బాపట్ల3
3/8

బాపట్ల

బాపట్ల4
4/8

బాపట్ల

బాపట్ల5
5/8

బాపట్ల

బాపట్ల6
6/8

బాపట్ల

బాపట్ల7
7/8

బాపట్ల

బాపట్ల8
8/8

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement