వైఎస్సార్‌ను అవమానిస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ను అవమానిస్తే సహించం

Oct 12 2025 7:12 AM | Updated on Oct 12 2025 7:12 AM

వైఎస్సార్‌ను అవమానిస్తే సహించం

వైఎస్సార్‌ను అవమానిస్తే సహించం

వైఎస్సార్‌ను అవమానిస్తే సహించం

వైఎస్సార్‌ సీపీ నాయకుల హెచ్చరిక

చీరాల: వైఎస్సార్‌ను కించపరిస్తే ఊరుకోబోమని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న గడియార స్తంభం విషయమై వైఎస్సార్‌ విగ్రహం వద్ద మెట్లు, స్టీలు రెయిలింగ్‌ను తొలగించాలంటూ మున్సిపల్‌ చైర్మన్‌ తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం చీరాలలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్సార్‌ విగ్రహం వద్ద గల కూడలిలో గడియార స్తంభం నిర్మాణం గురించి రెండు రోజుల క్రితం మున్సిపల్‌ చైర్మన్‌ మించాల సాంబశివరావు స్థానిక కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారన్నారు. గతంలో ప్రతిపాదించిన రెండు అంశాలను కాకుండా మూడో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. వైఎస్సార్‌ అభిమానుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా విగ్రహాన్ని ఆనుకొని ఉన్న మెట్లను, స్టీలు రాడ్లు తొలగించే ప్రయత్నాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. గతంలో కౌన్సిల్‌లో తీర్మానం చేసి ఏఆర్‌ఎం కాంప్లెక్స్‌పైన 25 అడుగుల గడియార స్తంభం నిర్మించేందుకు టెండర్‌ పిలిచారన్నారు. దానిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడున్న చైర్మన్‌ కాదా అని ప్రశ్నించారు. రెండు సార్లు వైఎస్సార్‌సీపీ బీ– ఫాంపై గెలిచి నేడు వైఎస్సార్‌ సీపీ తరఫున కౌన్సిలర్‌గా ఉండి ప్రతిపాదించిన వ్యక్తులు టీడీపీ కండువా కప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో కారంచేడు గేటు సెంటర్‌లో కూడా వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. కౌన్సిల్‌ ఆమోదించిన దానిని కాకుండా మరోలా చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్‌రెడ్డి, బీసీ సెల్‌ మెంబర్‌ గోలి గిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాస్టర్‌, లీగల్‌ సెల్‌ సభ్యులు రాజు వెంకటేశ్వరరెడ్డి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవరావు, మాజీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, రైతు విభాగం చైర్మన్‌ కావూరి రమణారెడ్డి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జంగా మహేష్‌, కౌన్సిలర్లు బత్తుల అనిల్‌, కంపా అరుణ్‌, చీమకుర్తి బాలకృష్ణ, మహిళా నాయకులు ప్రసన్న, పార్టీ నాయకులు రాజ్‌కుమార్‌, చెల్లి బాబూరావు, కె.పూర్ణ, కె.చిట్టిబాబు, వెంకటరావు, టి.వినయ్‌, జంగా ప్రేమ్‌, బాలకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement