
లిఫ్టులో ఇరుక్కున్న ప్రయాణికులు
నడికుడి రైల్వే జంక్షన్‌లో ఘటన నిలిచిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు
దాచేపల్లి: నడికుడి రైల్వే జంక్షన్‌లో ఉన్న లిఫ్ట్‌లో ప్రయాణికులు గురువారం ఇరుక్కుపోయారు. నడికుడి రైల్వేస్టేషన్ నుంచి గుంటూరు వెళ్లేందుకు ప్రయాణికులు నడికుడి రైల్వేస్టేషన్‌కి చేరుకున్నారు. ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం నుంచి రెండో నెంబర్ ప్లాట్ ఫారం పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా ఆకస్మాత్తుగా లిఫ్టు మధ్యలో ఆగిపోయింది. దీంతో లిఫ్ట్‌లో ప్రయాణికులు ఇరుక్కుపోయి తీవ్ర భయాందోళన చెందారు. ఈ విషయం అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు గమనించి రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్‌లోకి వచ్చి ఆగింది. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు ఈ రైలులోనే వెళ్లాల్సి ఉంది. రైల్వే సిబ్బంది అతి కష్టం మీద లిఫ్ట్ ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వీరిని బయటకు తీసేంతవరకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలుని స్టేషన్‌లోనే ఆపేశారు. సుమారు పది నిమిషాలపాటు రైలు ఆగింది. తర్వాత లిఫ్ట్‌లో ఇరుక్కున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి వెళ్లారు. ఇటీవల కాలంలో నడికుడిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు తరచూ ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు.

లిఫ్టులో ఇరుక్కున్న ప్రయాణికులు