
ఎన్‌ఎంఎంఎస్ నమోదుకు 30 తుది గడువు
చేతిరాతలో ఉచిత శిక్షణ అందిస్తున్నందుకు గుర్తింపు ఒకే నెల జిల్లా నుంచి జాతీయస్థాయి వరకు మూడు అవార్డులు
డీఈఓ చంద్రకళ
నరసరావుపేట ఈస్ట్: నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్‌షిప్ పరీక్ష రాసేందుకు ఈనెల 30వ తేది వరకు విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష డిసెంబర్ 7వ తేదీన నిర్వహిస్తారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండల ప్రాథమికోన్నత, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులని తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఇవ్వబడిన ఎస్‌బీఐ కలెక్ట్ లింక్ ద్వారా చెల్లించాలని తెలిపారు. వివరాలకు డీఈఓ కార్యాలయంలో పి.శంకరరాజు (9963192487)ను సంప్రదించాలని సూచించారు.
యడ్లపాడు: విద్యార్థులకు చేతిరాతలో ఉచిత శిక్షణ ఇస్తూ తనదైన శైలిలో గుర్తింపు పొందిన కొండవీడు జెడ్పీ హైస్కూల్ ఎస్జీటీ ఉపాధ్యాయుడు డాక్టర్ షేక్ జున్నుసాహెబ్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో బిర్లా ప్లానెటోరియం వద్ద ఉన్న భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు నేషనల్ టీచర్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు–2025ను ప్రదానం చేశారు.
ఒకే నెలలో మూడు అవార్డులు
విద్యారంగానికి జున్ను సాహెబ్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ నెలలో ఇది మూడో అవార్డు రావడం విశేషం. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆయనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈనెల 7న విశాఖపట్నంకు చెందిన సెయింట్ మదర్‌థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి గురుబ్రహ్మ రాష్ట్రస్థాయి అవార్డు, తాజాగా జాతీయస్థాయి అవార్డు తెలంగాణ రాష్ట్రంలో అందుకున్నారు.