
పార్క్ చేసిన బుల్లెట్ చోరీ
చీరాల అర్బన్: స్థానిక దర్బార్ రోడ్డులోని ఓ షాపు ఎదుట పార్క్ చేసిన బుల్లెట్ బైక్‌ను శుక్రవారం రాత్రి దుండగులు అపహరించుకెళ్లారు. దుండగులు బైక్ హ్యాండిల్‌ను కాలుతో తన్ని లాక్ తీశారు. బైక్ స్టార్ట్ చేసుకొని దర్జాగా వెళ్లిపోయారు. చోరీ దృశ్యాలు షాపు వద్ద ఉన్న సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. శనివారం బుల్లెట్ బైక్ కనిపించకపోవడంతో వాహనదారుడు సీసీ కెమెరాలలో చూసి చీరాల ఒన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
మార్టూరు: మండల కేంద్రంలో శనివారం గుర్తు తెలియని పురుషుని మృతదేహం వెలుగు చూసింది. స్థానికులు పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కొణిదెన రోడ్డులో వైన్స్ షాపుల సమీపంలోని చెట్ల కింద పురుషుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు వీఆర్వో మోహన్ రావు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండవచ్చని మద్యంలో గడ్డి మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుడి చేతికి రాఖీ, ఎడమ చేతికి గోల్డ్ కలర్ వాచ్ ఉంది. రెండు రోజుల క్రితం చనిపోయినట్లు భావిస్తున్న మృతదేహాన్ని మార్టూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి భద్రపరిచారు.
మరొకరికి తీవ్ర గాయాలు
కారంచేడు: ఎదురెదురుగా వస్తున్న కారు, ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం చీరాల–స్వర్ణ దండుబాట రోడ్డులో స్వర్ణ సమీపంలోని టపాసుల గోదాముల వద్ద జరిగింది. కారంచేడు ఎస్‌ఐ షేక్ ఽఖాదర్‌బాషా అందించిన సమాచారం మేరకు.. జె. పంగులూరు గ్రామానికి చెందిన కొమరాబత్తిన శ్రీనివాసరావు (50) చీరాల నుంచి స్వర్ణ మీదుగా ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్న ఇంకొల్లు మండలం గంగారానికి బయలుదేరారు. కాగా మార్గమధ్యంలో జోరుగా వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో స్వర్ణ వైపు నుంచి చీరాలకు వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంతో ద్విచక్రవాహనం నడుపుతున్న శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పిడుగురాళ్ల: చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల మెడికల్ కళాశాల వద్దకు వెళ్లిన 43 మందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పిడుగురాళ్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు జాగ్రత్తలలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలప్పుడు లా ఆండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా వారిని అదుపులోకి తీసుకొని, సొంత పూచీకత్తుపై పంపించినట్లు పోలీసులు తెలిపారు.

పార్క్ చేసిన బుల్లెట్ చోరీ