చందోలు(కర్లపాలెం): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన ఖాజీపాలెం పంచాయతీ పరిధిలోని అయోధ్యనగర్‌లో చోటుచేసుకుంది. చందోలు ఎస్‌ఐ ఎంవీ శివకుమార్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు... అయోధ్యనగర్‌కు చెందిన కంతేటి మల్లేశ్వరరావు(29) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం రాత్రి తమ ఇంటి సమీపంలోని తుమ్మ చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడని తెలిపారు. మల్లేశ్వరరావుకు భార్య సముద్రాలు ఉందన్నారు. మృతుని సోదరుడు రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించామని పేర్కొన్నారు.
కారు ఢీకొని ద్విచక్రవాహన చోదకుడు మృతి
కర్లపాలెం: బైకును కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, స్ధానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామానికి చెందిన ఆట్ల అంజిరెడ్డి(54) చీరాల వెళ్లి బైకుపై తిరిగి వస్తున్నాడు. ఇంతలో బాపట్ల నుంచి చీరాల వైపు వెళుతున్న కారు తోటవారిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై అతడి బైకును ఎదురుగా ఢీకొంది. అంజిరెడ్డికి తీవ్రగాయాలు కావటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కారు రోడ్డు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులో ఉన్న ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈపురుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాపట్ల ఆర్మీ ఉద్యోగి రాజస్థాన్‌లో మృతి
బాపట్ల టౌన్: బాపట్ల ప్రాంతానికి చెందిన ఆర్మీ ఉద్యోగి రాజస్థాన్‌లో మృతి చెందారు. బాపట్ల మండలం, వెదుళ్ళపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన మేడిబోయిన వెంకట దుర్గారెడ్డి 2023లో అగ్నివీర్‌గా ఆర్మీ ఉద్యోగంలో చేరారు. రాజస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న దుర్గారెడ్డి గురువారం రాత్రి మృతి చెందారు. విశ్వసనీయ సమాచారం మేరకు దుర్గారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహం శనివారం స్వగ్రామానికి వస్తుందని ఆర్మీ అధికారులు, పోలీసులు తెలిపారు.
యువకుడు ఆత్మహత్య
యువకుడు ఆత్మహత్య
యువకుడు ఆత్మహత్య